కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం మాచవరంలో ‘మీ భూమి- మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో 16 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న 224 భూ సమస్యలను పరిష్కరించామని చెప్పారు. 120 ఏళ్లుగా ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరించామని, మాచవరం, ముమ్మిడివరం, రామచంద్రాపురంలో 56.37 ఎకరాల భూమితో 1,410 మందికి లబ్ధి కలిగించామని వివరించారు.
Don’t receive OTP? Resend