మద్యం రవాణా టెండర్ల కుంభకోణం కేసులో మాజీ కమిషనర్ వాసుదేవరెడ్డి ప్రాసిక్యూషన్కు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. పీఎంఎల్ఏ చట్టం కింద ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. కేంద్రీకృత రవాణా విధానం, ధరల పెంపులో నిబంధనల ఉల్లంఘనలతో ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం జరిగిందని పేర్కొంది. నకిలీ సంస్థల ద్వారా అక్రమ సంపాదన మళ్లించారని, అనుభవం లేని ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్కు నిబంధనలు మార్చి టెండర్లు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి.
Don’t receive OTP? Resend