భూ వివాదంలో మేం కూడా బాధితులమే: తమ్మినేని
అమరావతి: శ్రీకాకుళం భూ వివాదంలో తాము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని వైసిపి నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. భూమి విక్రయిస్తామని చెప్పిన వారు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేశామని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పరిశీలన అనంతరమే రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిపారు. భూ యజమాని మోసపోయి ఉంటే బాధాకరమని, ఈ వ్యవహారంలో తాము కూడా బాధితులమేనని పేర్కొన్నారు.
Login
Comments (0)