తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మిత్రపక్షాల ఎంపీలు కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు, రాష్ట్రాల వారీగా సీట్ల కేటాయింపును యథాతథంగా కొనసాగించాలని తీర్మానించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, వీసీకే, ఎండీఎంకే, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన 19 మంది ఎంపీలు హాజరుకాగా, డీఎంకే, అన్నాడీఎంకే బహిష్కరించాయి.
Don’t receive OTP? Resend