ఏపీతో అనుబంధం ఉన్న స్కైరూట్ వ్యవస్థాపకులు
భారత తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 విజయంతో గుర్తింపు పొందిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, నాగభరత్ డాకాకు ఆంధ్రప్రదేశ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. పవన్ కుమార్ చందన ఏలూరు అల్లుడు కాగా, నాగభరత్ డాకా మచిలీపట్నంలో జన్మించి విశాఖపట్నంలో పెరిగారు. ఇస్రోలో శాస్త్రవేత్తలుగా పనిచేసిన వీరు కలిసి స్కైరూట్‌ను స్థాపించి భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు.
తిరుపతి, విశాఖతో అనుబంధం.. ఏలూరు అల్లుడు నాగభరత్
స్కైరూట్ ఏరోస్పేస్ సహ-వ్యవస్థాపకుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) నాగభరత్ డాకా బాల్యం, విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో సాగింది. అనంతరం చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. అక్కడే పవన్ కుమార్ చందనతో కలిసి పనిచేస్తూ 2018లో స్కైరూట్ ఏరోస్పేస్‌కు శ్రీకారం చుట్టారు.
వ్యక్తిగత జీవితంలోనూ ఆయనకు ఆంధ్రతో బలమైన అనుబంధం ఉంది. ఏలూరుకు చెందిన చావలి శ్రీరామచంద్రమూర్తి, బాల త్రిపురసుందరి దంపతుల కుమార్తె పావనిని 2016లో వివాహం చేసుకోవడంతో నాగభరత్ ఏలూరు అల్లుడయ్యారు.
మచిలీపట్నంలో జననం.. విశాఖ నుంచి హైదరాబాద్ వరకు పవన్ కుమార్ ప్రయాణం
స్కైరూట్ ఏరోస్పేస్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన మచిలీపట్నంలో జన్మించారు. ఆయన తండ్రికి ప్రభుత్వ ఇంజినీర్‌గా ఉద్యోగం రావడంతో కుటుంబం ముందుగా విశాఖపట్నానికి మారింది. బాల్యంలో కొంతకాలం అక్కడే పెరిగిన పవన్, అనంతరం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లారు. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
తర్వాత ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్–ఎంటెక్ పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. జీఎస్ఎల్వీ మార్క్-3 వంటి కీలక రాకెట్ ప్రాజెక్టులపై పనిచేసిన అనంతరం 2018లో నాగభరత్ డాకాతో కలిసి స్కైరూట్ ఏరోస్పేస్ను స్థాపించారు. భారత తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విజయంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
Login
Comments (0)