ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం శాంసంగ్ టెక్ ప్రియులకు షాకిచ్చింది. పండుగ సీజన్ సమీపిస్తున్న వేళ ఎంపిక చేసిన కొన్ని పాపులర్ ఏ-సిరీస్ మోడళ్ల ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గెలాక్సీ ఏ17 మోడల్‌పై ధరలను అమాంతం పెంచేయడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
శాంసంగ్ ఏ17 మోడల్ 8జీబీ ప్లస్ 256జీబీ టాప్ వేరియంట్ ధరను గతంలో ఉన్న రూ.23,999 నుంచి ఏకంగా రూ.38,499కి పెంచింది. అంటే కేవలం ఈ ఒక్క మోడల్‌పైనే రూ.14,500 వరకు ధర పెరిగింది. ట్రావెల్ అడాప్టర్ లేని ఏ17 మోడళ్లపై రూ.3,500 వరకు పెంచగా, అడాప్టర్‌తో కూడిన మోడళ్లు రూ.29,999 నుంచి అందుబాటులో ఉంటాయి. గతంలో ఈ టాప్ వేరియంట్ ధర సవరించకపోవడంతో ఇతర మోడళ్లతో సమానంగా ఉండేలా ఇప్పుడు భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
కేవలం ఏ17 మాత్రమే కాకుండా ఇతర మోడళ్లపై కూడా ధరలభారం పడింది. శాంసంగ్ ఏ27 మోడల్‌పై గరిష్ఠంగా రూ.5,000 వరకు పెంచింది. ఈ మోడల్లోని 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.2,000, 8జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ధర రూ.4,000, అలాగే 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధరను రూ.5,000 మేర పెంచారు. వీటితో పాటు ఏ07 మోడల్‌పై రూ.2,000, ఎఫ్17 మోడల్ ధరలను రూ.3,500 చొప్పున పెంచేశారు.
మార్కెట్లో మెమొరీ చిప్‌ల ధరలు క్రమంగా పెరుగుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కొత్త ధరలు అన్నీ సెప్టెంబర్ 2 నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని శాంసంగ్ అధికారికంగా వెల్లడించింది.
Don’t receive OTP? Resend