పుష్కరాల తొలి రోజే పోలవరం ప్రారంభంపై చర్చ
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల తొలి రోజున పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. షెడ్యూల్ ప్రకారం 2027 మార్చికే ప్రాజెక్టు పూర్తవుతుందని, పుష్కరాల ప్రారంభ రోజునే ప్రారంభోత్సవం నిర్వహిస్తే చారిత్రక ప్రాధాన్యం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. గోదావరి పుష్కరాలు 2027 జులై 26న ప్రారంభం కానున్నాయి.
Login
Comments (0)