అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోడి హర్షం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లపై చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తన ప్రియమిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం సంతోషంగా ఉందని, ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను 18 శాతానికి తగ్గించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయని, భారత్–అమెరికా సహకారం ప్రజలకు మేలు చేస్తుందని మోదీ పేర్కొన్నారు.
Login
Comments (0)