దిల్లీ: తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రంలో డేటా లీకేజీపై ఎన్పీసీఐఎల్ వివరణ ఇచ్చింది. లీకైన ఫైళ్లు బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్‌కు సంబంధించినవేనని, అణు భద్రతా వ్యవస్థలకు సంబంధించిన సమాచారం బయటకు వెళ్లలేదని స్పష్టం చేసింది. యూనిట్లు 3, 4 నిర్మాణ పనులకు సంబంధించిన ఇంజినీరింగ్, సేకరణ, నిర్మాణ సేవల సమాచారమే లీకైందని, అణు భద్రతకు ఎలాంటి ముప్పు లేదని వెల్లడించింది.
Don’t receive OTP? Resend