భోగాపురం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆగస్టు 1న జరిగే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. కార్యక్రమానికి హాజరవుతానని ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మతో పాటు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు.
Login
Comments (0)