మచిలీపట్నానికి చెందిన ఓ మహిళను సుప్రీంకోర్టు జడ్జి, ఢిల్లీ పోలీసులు, ఈడి అధికారుల పేర్లతో భయపెట్టి సైబర్ నేరగాళ్లు రూ.1.43 కోట్లు కాజేశారు. మనీలాండరింగ్ కేసు పేరుతో వీడియో కాల్స్ చేసి, కోర్టుకు డబ్బు ప్లెడ్జ్ చేయాలని నమ్మించి విడతల వారీగా నగదు బదిలీ చేయించుకున్నారు. అనంతరం మరో రూ.95 లక్షలు డిమాండ్ చేయడంతో మోసాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Don’t receive OTP? Resend