స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేసి విజయం సాధించేలా పార్టీని సిద్ధం చేయాలని వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలకు సూచించారు. ఆగస్టు 15 నుంచి నాలుగు నెలలపాటు గ్రామాలు, వార్డుల్లో పర్యటిస్తూ పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. అలాగే ఆగస్టు 9న విజయవాడలో బీసీ గర్జన సభ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు.
Don’t receive OTP? Resend