అమరావతి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిపై నమోదైన కేసులో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతోందని వైసిపి అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ప్రమాదం దురదృష్టకరమైనదేనని, అయితే చట్ట ప్రకారమే వ్యవహరించాలని అన్నారు. తొలుత పోలీసులు నమోదు చేసిన హత్య అభియోగాలపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసి, సంబంధిత సెక్షన్లను మార్చాలని ఆదేశించిందని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం మత్స్యకారుల్ని అణిచివేస్తోందని ఆరోపించారు.
Don’t receive OTP? Resend