విశాఖపట్నం: బోటు ప్రమాదంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైసిపి అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. జులై 4న రాత్రి 7 గంటలకే ప్రమాద సమాచారం అందినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. జులై 5 ఉదయం 5 గంటల వరకు సమాచారం లేదని త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొనడం ద్వారా చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. బాధిత మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు.
Don’t receive OTP? Resend