హర్మూజ్ మార్గంలో భారత నావికుల నియామకానికి బ్రేక్
దిల్లీ: హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే నౌకల్లో భారతీయ నావికులను నియమించవద్దని కేంద్ర ప్రభుత్వం షిప్పింగ్ సంస్థలకు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మారిటైమ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. గల్ఫ్ ప్రాంత భద్రతా పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, అంతర్జాతీయ నౌకాయాన భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
Login
Comments (0)