రష్యా సాయుధ దళాల్లో మొత్తం 227 మంది భారతీయులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. విదేశాంగ శాఖ వర్గాల వెల్లడించిన వివరాల ప్రకారం రష్యా సైన్యంలో వివిధ రకాలుగా చేరిన ఈ భారతీయుల్లో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 139 మందిని సైనిక విధుల నుంచి తొలగించినట్లు కేంద్రం స్పష్టం చేసింది.
మిగిలిన భారతీయ పౌరులను కూడా రష్యా సైన్యం నుంచి పూర్తిగా బయటకు తీసుకువచ్చి స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయమై రష్యా అధికారులతో దౌత్య మార్గాల్లో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్థాన్ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడిన సందర్భంలో అధికారులు ఈ కీలక గణాంకాలను బయటపెట్టారు. రష్యా ఆర్మీలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.
Don’t receive OTP? Resend