నాలుగో సారి భారీగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపు
మరోసారి భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే మూడు విడతలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ ధర రూ.104.88, గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.117.59, డీజిల్ ధర రూ.105.28, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ ధర రూ.103.74.
Login
Comments (0)