గణేశ్ చతుర్థి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించే ప్రజలకు మద్దతుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, శ్రేయస్సు, విజయాలు కలగాలని లోకేశ్ ఆకాంక్షించారు.
Don’t receive OTP? Resend