ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్ఆర్టీ) నైజీరియా ప్రతినిధిగా తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు ధూళిపూడి చంద్రశేఖర్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నట్లు ఆయన తెలిపారు. 2004లో నైజీరియాకు వెళ్లిన చంద్రశేఖర్ డెయిరీ రంగంలో అనుభవం సంపాదించి, 2018లో అక్కడే 'నేచురల్ డైరీ' స్టార్టప్‌ను ప్రారంభించారు.
Don’t receive OTP? Resend