అమరావతి: ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న డేటా సెంటర్లకు ఏడాదికి 3.50 టీఎంసీల నీరే అవసరమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. డేటా సెంటర్ల నీటి అవసరాలపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని, ప్రజలకు వాస్తవాలను వివరించాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జల నిర్వహణ చేపట్టాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో పోలవరం, వెలిగొండ సహా 36 ప్రాజెక్టులపై సమీక్షించారు.
Don’t receive OTP? Resend