జగన్ పరామర్శపై చంద్రబాబు విమర్శలు
అమరావతి: జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వైసిపి అధినేత వైఎస్ జగన్ వెళ్లడంపై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదంలో గొర్రెల కాపరి మృతి కేసులో సాక్ష్యాలను తారుమారు చేసి మరొకరి జీవితాన్ని బలిచేయాలని చూసిన వారిని పరామర్శించి సమాజానికి ఏం సందేశం ఇస్తారని ప్రశ్నించారు. చట్టాలకు గౌరవం లేని వారే వ్యవస్థలను దెబ్బతీస్తారని వ్యాఖ్యానించారు.
Login
Comments (0)