ప్రభుత్వ అధికారిక విదేశీ పర్యటనల్లో నిబంధనలు పాటించలేదంటూ తమిళనాడుకు చెందిన ఇద్దరు మంత్రులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ తాఖీదులు పంపింది. పాఠశాల విద్యాశాఖ మంత్రి రాజ్‌మోహన్, పరిశ్రమలశాఖ మంత్రి కీర్తన డిప్లొమటిక్ పాస్‌పోర్ట్‌తో ప్రయాణించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరించినట్లు పేర్కొంది. ఈ విషయంలో సచివాలయం, ఐఏఎస్ అధికారులు విధులను సక్రమంగా నిర్వర్తించలేదని కూడా కేంద్రం అభిప్రాయపడినట్లు సమాచారం.
Don’t receive OTP? Resend