అంబటి రాంబాబుపై కేసు నమోదు
కాకినాడ: మాజీ మంత్రి, వైసిపి నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, వారిని తోసేశారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్ల ఫిర్యాదు మేరకు అంబటి రాంబాబుతో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Login
Comments (0)