దిల్లీ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖ ఇప్పటికే భోగాపురం విమానాశ్రయాన్ని ఇమిగ్రేషన్ చెక్పోస్ట్గా గుర్తించడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు మార్గం సుగమమైంది.
Don’t receive OTP? Resend