భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా 14 వేల మంది గిరిజన బాలికలతో ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఉత్తరాంధ్రలోని పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతాలకు చెందిన 8, 9, 10వ తరగతి విద్యార్థినులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రయత్నంలో పాల్గొననున్నారు.
Don’t receive OTP? Resend