ఏపీలో కొవిడ్ కేసులు 49కు చేరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసుల సంఖ్య 49కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. గుంటూరులో మూడు, ఎన్టీఆర్ జిల్లాలో రెండు, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, తిరుపతి జిల్లాల్లో ఒక్కో కేసు గుర్తించారు. ఇప్పటివరకు 302 మందికి పరీక్షలు నిర్వహించగా, నలుగురు మృతిచెందారు.
Login
Comments (0)