500వ అంతర్జాతీయ విజయం సాధించిన పీవీ సింధు
డెస్క్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సాధించింది. అంతర్జాతీయ కెరీర్లో 500వ విజయాన్ని నమోదు చేసి బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పటివరకు ఐదుగురికే పరిమితమైన ఈ ఘనతను సాధించిన ఆరో షట్లర్‌గా, తొలి భారతీయురాలిగా సింధు నిలిచింది. ఇండోనేషియా మాస్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన హోజ్ మార్క్‌ను ఓడించి ఈ మైలురాయిని చేరుకుంది.
Login
Comments (0)