భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యానికి ట్రంప్ బృందమే కారణమన్న టెడ్ క్రూజ్
డెస్క్ : భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి వైట్ హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవర్రో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ ప్రైవేట్‌గా వ్యాఖ్యానించినట్లు Axios వెబ్ సైట్ వెల్లడించింది. రాజకీయ విరాళాలు ఇచ్చేవారితో ఆయన చేసిన ఫోన్ కాల్స్ ఆడియో లీక్ అయ్యిందని తెలిపింది. భారత్ ఎగుమతులపై అమెరికా విధించిన 50% సుంకాలు ఐదు నెలలుగా కొనసాగుతుండటంతో ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. భారత్ తో సంబంధాలపై ట్రంప్ విధానాల పట్ల రిపబ్లికన్లలో ఉన్న విభేదాలకు ఇది సంకేతమని పరిశీలకులు భావిస్తున్నారు.
Login
Comments (0)