న్యూయార్క్: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీలకు ఈమెయిల్ ద్వారా సమన్లు జారీ చేసేందుకు మార్గం సుగమం చేయాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కోరింది. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం, న్యూయార్క్ బ్రూక్లిన్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గరౌఫిస్ను ఎస్ ఈ సి ఈ మేరకు బుధవారం ఆశ్రయించింది. అదానీకి సమన్లు ఇవ్వటానికి భారత్ ప్రభుత్వ సహకారం కోసం పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని ఎస్ ఈ సి తెలిపింది. అదానీ కంపెనీ గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లకి సంబంధించి భారత్ లో రాజకీయ నాయకులకు లంచం ఇచ్చిందనే ఆరోపణలతో న్యూయార్క్ లో కేసు నమోదైంది.
Don’t receive OTP? Resend