సూర్యాపేట: కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Don’t receive OTP? Resend