భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో సహాయక చర్యల విషయంలో నేపాల్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంది. విదేశీ సహాయక బృందాలను దేశంలోకి అనుమతించేందుకు అంగీకరించింది.
తొలుత విదేశీ బృందాల సహాయం అవసరం లేదని, తమ దేశ రక్షక దళాలే సమర్థంగా పనిచేయగలవని నేపాల్ స్పష్టం చేసింది. అయితే విదేశీ సహాయక బృందాలను అనుమతించాలంటూ ఆయా దేశాల నుంచి వచ్చిన దౌత్యపరమైన ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
పరిమిత సంఖ్యలోనే అనుమతి
వరదల్లో గల్లంతయిన వారిలో పలు దేశాల పౌరులు కూడా ఉండటంతో ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో సొరంగాల్లో రక్షణ చర్యలు చేపట్టగల సిబ్బంది, డీఎన్ఏ టెస్టింగ్, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించగల అంతర్జాతీయ నిపుణుల బృందాలను మాత్రమే అనుమతించాలని నేపాల్ భావిస్తోంది.
అన్ని విభాగాలకు కాకుండా కేవలం నిర్దిష్ట రంగాల్లో మాత్రమే పరిమిత సంఖ్యలో రెస్క్యూ టీమ్స్‌ను అనుమతించనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Don’t receive OTP? Resend