నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశంలోని ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. సున్ కోషి, బుధి గండకి, మహాకాళి వంటి కీలక నదులలో నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటడంతో సమీప గ్రామాలు, లోతట్టు ప్రాంతాలకు వరద ప్రమాదం పొంచి ఉందని అధికారులు తెలిపారు.
లమ్జంగ్ జిల్లా పరిధిలోని మార్శ్యాంగ్డి నది కూడా ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఆర్ఆర్ఎమ్ఏ) హెచ్చరికలు జారీ చేసింది.
పెరుగుతున్న మృతుల సంఖ్య
వర్షాలు, వరదల తీవ్రత వల్ల నేపాల్‌తో పాటు టిబెట్ పరిధిలో కలిపి మొత్తం మరణాల సంఖ్య 1,130కి చేరినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఇప్పటివరకు 1,113 మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించి, చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశామని అధికారులు వెల్లడించారు. వీటిలో 95 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించగా, గుర్తింపు లభించని 911 మృతదేహాల వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు
ప్రకృతి విపత్తు ధాటికి దాదాపు 4,858 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. సుమారు 7,912 మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు వరదల్లో చిక్కుకున్న 6,541 మందిని క్షేమంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. అయితే దేశంలో పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తుండటంతో సహాయక, పునరావాస చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
Don’t receive OTP? Resend