లీక్ ఆరోపణల నేపధ్యంలో నీట్ 2026 పరీక్ష రద్దు
నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీకైనట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏ దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసింది. విద్యార్థుల ప్రయోజనాలు, పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని, విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రశ్నాపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.
Login
Comments (0)