అమరావతి: సింగపూర్‌కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ గ్లోబల్ స్కూల్ గ్రూప్ (జీఎస్జీ) అమరావతిలో తన గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (జీఐఐఎస్) క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని జీఎస్జీ ఛైర్మన్ అతుల్ తెముర్నికర్ కలుసుకుని అమరావతిలో సంస్థ విస్తరణ ప్రణాళికలను వివరించారు. జీఐఐఎస్ క్యాంపస్ ఏర్పాటుకు అమరావతి సమీపంలోని శాఖమూరు వద్ద సీఆర్డీఏ ఇటీవల నాలుగు ఎకరాల భూమిని కేటాయించింది.
Don’t receive OTP? Resend