కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిని ఆ పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది. గోపాల్పేట మండలంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బి.ఫారాలను పార్టీ, నాయకులు డబ్బులకు అమ్ముకుంటున్నారంటూ చిన్నారెడ్డి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి పదవి కోల్పోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Don’t receive OTP? Resend