అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణశాఖ మూడు రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, పిడుగుల ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Don’t receive OTP? Resend