ఏపీపీఎస్సీ గ్రూప్-1 వాల్యుయేషన్ పై సిట్ కు ఆదేశం
అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలని వెలికితీసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి సిట్‌కు నేతృత్వం వహించాలని, మార్చి 16వ తేదీలోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు నిర్దేశించింది. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకోవాలని సూచించింది. ఎంపికైన అభ్యర్థుల ఆన్సర్ షీట్లు భద్రంగా ఉన్నాయో, లేదో నిర్ధారించాలని స్పష్టం చేసింది.
Login
Comments (0)