అమరావతి సీడ్‌యాక్సిస్ రోడ్డు మధ్యలో మిగిలిన పనులు చేపట్టేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. భూసేకరణకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసిన న్యాయస్థానం, విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా భూసేకరణ ప్రక్రియను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. దీంతో నిలిచిపోయిన సీడ్‌యాక్సిస్ రోడ్డు పనులను కొనసాగించేందుకు అడ్డంకులు తొలగినట్లైంది. అమరావతికి ప్రధానమైన ఈ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 13 న ప్రారంభం చేయనున్నారు.
Don’t receive OTP? Resend