న్యూఢిల్లీ: 1980వ దశకంలో దూరదర్శన్లో ప్రజాదరణ పొందిన ఇంగ్లీష్ న్యూస్ యాంకర్ సరళ మహేశ్వరి ఢిల్లీలో మృతి చెందారు. ఆమె వయసు 71. సరళ మహేశ్వరి వార్తలను అందించడంలో తనదైన శైలితో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. మృదువైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, గంభీరమైన శైలితో భారతీయ వార్తా ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఏర్పడిందని దూరదర్శన్ ఆమెకు నివాళి అర్పించింది.
Don’t receive OTP? Resend