లండన్: తూర్పు ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జూన్ 30న జరిగిన సెస్నా విమాన ప్రమాదంలో మృతులు భారతీయులుగా పోలీసులు గుర్తించారు. పైలట్ డయాన్ పటేల్ (26), విద్యార్థి వంశీ మండల (24)గా వెల్లడించారు. యూనివర్సిటీ చదువు పూర్తయిన సందర్భంగా వంశీతో కలిసి చిన్న విమానయాత్రకు నార్త్ వీల్డ్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
Don’t receive OTP? Resend