ఆంధ్రప్రదేశ్లో ‘తల్లికి వందనం’ పథకం కింద ఈనెల 22 నుంచి 24 వరకు 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120 కోట్లను జమ చేయనున్నారు. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 67,47,190 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ ఏడాది గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తల పిల్లలను కూడా పథకంలో చేర్చగా, రాష్ట్రవ్యాప్తంగా 17 వేల మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలు లబ్ధి పొందనున్నారు.
Don’t receive OTP? Resend