తిరుమల: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. కుమారుడు శివాన్ ఎర్రన్నాయుడి పుట్టువెంట్రుకల మొక్కు సందర్భంగా సతీమణి శ్రావ్యతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. అలిపిరి మెట్ల మార్గంలో ఉదయం 11 గంటలకు నడక ప్రారంభించిన రామ్మోహన్నాయుడు దంపతులు, మధ్యాహ్నం 2 గంటలకు కొండపైకి చేరుకున్నారు. దారిలో 1000మెట్లకు పైగా బొట్లు పెడుతూ రామ్మోహన్నాయుడు కొండపైకి వచ్చారు.
Don’t receive OTP? Resend