హైదరాబాద్: విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వకుండా వేధించిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. ఆ విద్యార్థికి రూ.లక్ష పరిహారంతోపాటు రూ.10,000 కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. నాంపల్లికి చెందిన రాకేష్వర్మ కుమారుడు 2021 అక్టోబరులో మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ లో చేరారు. మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు కింద రూ.80 వేలు చెల్లించారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవడంతో విద్యార్థి చదువును కొనసాగించలేకపోయారు. అదనంగా 80 వేలు కట్టాలంటూ, సర్టిఫికెట్లని ఇవ్వలేదు.
Don’t receive OTP? Resend