యూఏఈ లాటరీలో కేరళ వ్యక్తికి రూ.78 కోట్లు
దుబాయ్: యూఏఈ లాటరీలో కేరళకు చెందిన సునీల్‌కుమార్ సదాశివన్ మూడు కోట్ల ఏఈడీ (రూ.78 కోట్లకుపైగా) గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. యూఏఈ లాటరీ చరిత్రలో ఈ బహుమతి అందుకున్న రెండో వ్యక్తిగా నిలిచారు. భార్య, ఇద్దరు కుమార్తెల పుట్టిన తేదీల ఆధారంగా లాటరీ నంబర్లు ఎంపిక చేసినట్లు తెలిపారు. గెలుచుకున్న నగదుతో స్వగ్రామంలో వ్యాపారం ప్రారంభించి, పేదలకు ఇళ్లు నిర్మించి, పిల్లలకు సాయం చేస్తానన్నారు.
Login
Comments (0)