సెమీకండక్టర్లకు రూ.1.89 లక్షల కోట్ల ప్యాకేజీ
దిల్లీ: దేశంలో సెమీకండక్టర్లు, మొబైల్ డిజైన్, తయారీ రంగాల ప్రోత్సాహానికి రూ.1.89 లక్షల కోట్ల ప్యాకేజీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందులో భారత సెమీకండక్టర్ మిషన్ 2.0కు రూ.1.27 లక్షల కోట్లు, మొబైల్ ఫోన్ తయారీ ప్రోత్సాహానికి రూ.62,500 కోట్లు కేటాయించారు. సెమీకాన్ 2.0 ద్వారా రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు, రూ.2 లక్షల కోట్ల విలువైన చిప్సెట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Login
Comments (0)