ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఇద్దరినీ తక్షణమే విధుల్లోకి తీసుకుంటూ గురువారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 4 వరకు సస్పెన్షన్ అమల్లో ఉండగా, డీజీపీ నివేదికలు, కాంతి రాణా టాటా వినతిపత్రాన్ని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వారిపై కొనసాగుతున్న క్రమశిక్షణ, క్రిమినల్ కేసులపై ఈ నిర్ణయం ప్రభావం చూపదని స్పష్టం చేసింది.
Don’t receive OTP? Resend