అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం 35 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా మెరుగుదలకు రూ.11,166 కోట్లతో 10 బహుళ గ్రామాల నీటి పథకాలు, 2,943 తాగునీటి పనులకు పరిపాలనా అనుమతి ఇచ్చారు. ఈ పనులను జల్ జీవన్ మిషన్తో పాటు ఇతర నిధుల సమీకరణ ద్వారా అమలు చేయనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
Don’t receive OTP? Resend