అమరావతిలో తొలిసారిగా ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రథయాత్రకు విశిష్టత ఉందని, దేవుళ్లంతా అమరావతికి వస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో అమరావతికి తిరుగుండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ పాల్గొనగా, వెంకటపాలెం టీటీడీ ఆలయం వద్ద భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.
Don’t receive OTP? Resend