మోడి అంటే నాకెంతో ఇష్టం: డొనాల్డ్ ట్రంప్
భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనకు తాను పెద్ద అభిమానినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా ఈ ఏడాది 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఆధ్వర్యంలో ఆ దేశ ఎంబసీ ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా ఫోన్ కాల్ ద్వారా లైవ్‌లోకి వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.
Login
Comments (0)