బంగ్లాదేశ్ రచయిత్రి, ఉద్యమకారిణి తస్లీమా నస్రీన్ 20 ఏళ్ల తర్వాత ఆగస్టు 1న కోల్‌కతాకు రానున్నారు. రవీంద్ర సదన్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. 2004 నుంచి భారత్‌లో ఉంటున్న తస్లీమా, 1990ల నుంచి ప్రవాస జీవితంలో ఉన్నారు. ఆమె రాకను బిజెపి పశ్చిమ బెంగాల్ నాయకులు స్వాగతించారు. గతంలో వామపక్ష ఫ్రంట్, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆమెకి రక్షణ కల్పించటానికి నిరాకరించాయి.
Don’t receive OTP? Resend